దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Aug 23 2025 2:53 AM | Updated on Aug 23 2025 2:53 AM

దూరవి

దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం

8 మంది విద్యార్థులు డీబార్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం జనరల్‌, కంప్యూటర్స్‌, బీఎస్సీ ఫైనలియర్‌ విద్యార్థులకు ఇయర్‌వైజ్‌స్కీం (ఎక్స్‌, రెగ్యులర్‌) పరీక్షలు శుక్రవారం 14 కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. వరంగల్‌ ఏఎస్‌ఎం, ఎల్‌బీ కాలేజీ కేంద్రాల్లో కాపీయింగ్‌ చేస్తూ పట్టుబడిన విద్యార్ధులను డీబార్‌ చేసినట్లు అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఏఎస్‌ఎం కాలేజీలో ఒకరు, ఎల్‌బీకాలేజీ కేంద్రంలో ఏడుగురు డీబార్‌ అయ్యారని తెలిపారు. ఇదిలా ఉండగా హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌కాలేజీ కేంద్రాన్ని పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.

అంతర్జాతీయ

జూడో రెఫరీగా నాగరాజు

మడికొండ: హనుమకొండ జిల్లా మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల జూడో కోచ్‌ నాగరాజు అంతర్జాతీయ జూడో రెఫరీగా ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు. ఇంటర్నేషనల్‌ జూడో ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జోర్ధాన్‌ రాజధానిలో జూడో రెఫరీ పరీక్షలు జరిగాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణలోని హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన నాగరాజు ఒక్కరే ఉత్తీర్ణత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొదటిసారి అంతర్జాతీయ జూడో రెఫరీగా ఎంపికై న నాగరాజును ప్రిన్సిపాల్‌ దాసరి ఉమామహేశ్వరి అభినందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మడికొండ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్‌ ఉమామహేశ్వరి, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల కార్యదర్శి అలుగ వర్షిణి, మల్టీజోనల్‌ ఆఫీసర్‌ అలివేలు, విద్యారాణి ప్రోత్సాహంతోనే ఈవిజయం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది నాగరాజును అభినందించి సన్మానించారు.

అప్పుల బాధతో రైతు

ఆత్మహత్య

కేసముద్రం : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మండలంలోని ఇంటికన్నెలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంధసిరి బొందయ్య (56) సుమారు రూ.5లక్షలకు పైగా అప్పు చేసి ఎకరంన్నర భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. మూడేళ్లుగా పంట దిగుబడి రాకపోవడంతో కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి మానుకోట జనరల్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతుడుకి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం
1
1/3

దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం

దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం
2
2/3

దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం

దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం
3
3/3

దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement