
రైతులకు తప్పని యూరియా కష్టాలు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో యూరియా కష్టాలు కొనసాగుతు న్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పీఏసీఎస్‌కు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు శనివారం కార్యాలయం తీయకముందే ఆధార్ కార్డులు లైన్‌లో పెట్టి వేచి ఉన్నారు. డోర్నకల్ మండలం కస్నాతండా సమీపంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు క్యూ కట్టారు.
రైతులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. గూ డూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘం ఎదుట తెల్లవారు జామున 4 గంటలకే క్యూ లో నిలబడ్డారు. మహబూబాబాద్‌లో రైతులు మధ్యా హ్నం సమయంలో తమకు బస్తాలు వస్తాయో రావో అనే దిగులుతో ఏఓ తిరుపతి రెడ్డితో వాగ్వాదానికి దిగారు.
కరీంనగర్ జిల్లాలో...
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కెపల్లి సహకార సంఘం గోదాంకు శనివారం మధ్యాహ్నం లారీలో 230 బస్తాలు వచ్చాయి. 500 మందికి పైగా గోదాం వద్దకు చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు క్యూలో నీరసించారు. సహకార సిబ్బంది ఒక్కరికి ఒక బస్తా చొప్పున టోకెన్లు ఇచ్చారు. శంకరపట్నం మండలం లింగాపూర్ గోదాంకు లారీ యూరియా వచ్చింది. 15 రోజుల క్రితం ఆధార్ కార్డు ఇచ్చిన వారికే టోకెన్లు ఇవ్వడంతో ఓ రైతు యూరియా ఇవ్వకుంటే షట్టర్ మూసివేస్తానని సిబ్బందితో వాదనకు దిగాడు.
పోలీసు బందోబస్తుతో 450 బస్తాలను రైతులకు అందించారు. చిగురుమామిడి మండలం ఇందుర్తికి శనివారం యూరియా లోడ్ వచ్చింది. ఆదివారం పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో రైతులు తమ చెప్పులను క్యూలో విడిచి వెళ్లారు.
300 బస్తాలు వచ్చాయి.. 102 మందికి పంపిణీ
శనివారం ఆత్మకూర్ పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3:30 గంటలకు 300 బస్తాలతో లోడ్ కావడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసుల భద్రత మధ్య సాయంత్రం వరకు 102 మందికి పంపిణీ చేశారు.
యూరియా కోసం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద రైతులు శనివారం తెల్లవారుజాము నుంచే వరుసలో నిల్చున్నారు. శుక్రవారం రాత్రి యూరియా లారీ లోడ్ వచి్చందన్న సమాచారంతో భారీగా తరలివచ్చారు. గోదాము తెరవకముందే వచ్చి వరుసలో నిలబడి నిరీక్షించారు. పోలీసుల బందోబస్తు నడుమ ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియాను పంపిణీ చేశారు.