
రిమాండ్ మహిళా ఖైదీకి పోస్టుమార్టం
నర్సంపేట రూరల్ : రిమాండ్ మహిళాఖైదీకి ఫోరెన్సిక్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. నర్సంపేట సబ్ జైలు రిమాండ్ మహిళా ఖైదీ పెండ్యాల సుచరిత (36) ఈనెల 21న మృతి చెందిన విషయం విధితమే. తొలుత నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, టౌన్‌సీఐ రఘుపతిరెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం వరంగల్ కేఎంసీ ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేందర్, సిద్దిపేట మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ హెచ్‌ఓడీ శ్రీధరాచారి, కుత్బుల్లాపూర్ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ హెచ్‌ఓడీ వసంత నాయక్‌తోపాటు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుచరిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.