
వర్షపాతం.. సాధారణం
పంటల సాగు ముమ్మరం
హన్మకొండ: ఇటీవల కురిసిన వర్షం ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోటు పూడ్చింది. అప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోటు, సాధారణ వర్షపాతం ఉండగా ఇటీవలి అల్పపీడనం, వాయుగుండంతో వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో సాధారణంగా నమోదైంది. జూలై 21 నుంచి 24వ తేదీ వరకు వరుసగా ఆరు రోజులు వర్షాలు కురిసినా సాధారణాన్ని మించలేదు. కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. ఇదిలా ఉండగా ఈ నెల 8 నుంచి 19 వరకు కురిసిన భారీ వర్షాలు లోటు పూడ్చడంతోపాటు సాధారణ వర్షపాతం నమోదైంది. ఆయా జిల్లాలో కొన్ని మండలాల్లో భారీ వర్షం కురవగా, మరికొన్నింటిలో తేలికపాటి నుంచి మోస్తరు కురిసింది. దీంతో జిల్లా సగటు సాధారణ వర్షపాతంగా నమోదైంది.
వ్యవసాయ పనులు ముమ్మరం..
ఈ వర్షంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సా గుతున్నాయి. ప్రధానంగా వరి నాట్లు ఊపందుకున్నాయి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి నీరు చేరగా, సాధారణంగా కురిసిన ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. ఈ నెల 21 వరకు ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసినా సాధారణాన్ని మించలేదు. వర్షాకాలంలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 843.4 మిల్లీ మీటర్లుగా కాగా ఇప్పటి వరకు 912 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో కన్నాయిగూడెం, వాజేడు మండలాల్లో లోటుగా ఉంది. ఏటూరుగానాగారం, వెంకటాపురం, మంగపేట మల్లంపల్లి మండలాల్లో సాధారణానికి మించి కు రిసింది. మిగతా మండలాల్లో సాధారణంగా నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 681.5 మి.మీ కాగా ఇప్పటి వరకు 651.9 మి.మీ కురిసింది. మహదేవ్‌పూర్, కాటారం మండలాల్లో లోటు వర్షపాతం, మిగతా మండలాల్లో సాధారణంగా నమోదైంది. మహబూబాద్ జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 567.9 మి.మీ కాగా ఇప్పటి వరకు 663 మి.మీ నమోదైంది. గూడూరు, కేసముద్రం, మరిపెడ, పెద్దవంగర మండలాల్లో సాధారణానికి మించి (ఎక్సెస్) కురిసింది. మిగతా మండలాల్లో సాధారణంగా నమోదైంది. జనగామ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లా సాధారణ వర్షపాతం 448.6 మి.మీ కాగా ఇప్పటి వరకు 499.5 మి.మీ మాత్రమే కురిసింది. స్టేషన్ ఘనపూర్‌లో లోటు వర్షపాతం ఉండగా నర్మెట, జనగామ, లింగాలఘణపురం, దేవరుప్పుల, కొడకండ్లలో ఎక్సెస్ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో సాధారణంగా నమోదైంది. హనుమకొండ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు 567.2 మి.మీ సాధారణ వర్షపాతం కాగా ఇప్పటి వరకు 569.1 మి.మీ కురిసింది. భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో ఎక్సెస్ వర్షం కురిసింది. ఎల్కతుర్తి మండలంలో లోటు వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో సాధారణంగా కురిసింది. వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 602.6 మి.మీ కాగా ఇప్పటి వరకు 756.9 మిల్లీమీటర్లు కురిసింది. వర్ధన్నపేటలో అతి అత్యధిక వర్షపాతం నమోదు కాగా, గీసుకొండ, దుగ్గొండి, ఖానాపురం, చెన్నారావుపేట, సంగెం, పర్వతగిరి, నెక్కొండ మండలాల్లో అత్యధికంగా కురిసింది. నల్లబెల్లి, నర్సంపేట, రాయపర్తి, ఖిలా వరంగల్, వరంగల్ మండలాల్లో సాధారణంగా కురిసింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటల సాగు ముమ్మరమైంది. సాధారణాన్ని మించి పంటల సాగైంది.
వరంగల్ జిల్లాలో..
వరంగల్ జిల్లాలో అన్ని పంటలు కలిపి సాధారణ సాగు 2,84,375 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 2,05,777 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,40,068 ఎకరాల్లో సాగైంది.
హనుమకొండ జిల్లాలో ..
హనుమకొండ జిల్లాలో సాధారణ సాగు మొత్తం 2,43,357 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 1,28,406 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 1,95,902 ఎకరాల్లో సాగైంది.
మహబూబాబాద్ జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం మొత్తం 3,52,531 కాగా ఇప్పటి వరకు 2,31,294 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 3,39,982 ఎకరాల్లో సాగైంది.
ములుగు జిల్లాలో..
ములుగు జిల్లాలో అన్ని పంటలు కలిపి మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 1,26,973 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 1,24,051 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 86,653 ఎకరాల్లో సాగైంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 2,12,415 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 2,34,195 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 1,92,244 ఎకరాల్లో సాగు చేశారు.
జనగామ జిల్లాలో..
జనగామ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం మొత్తం 3,63,104 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 3,06,732 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 2,67,111 ఎకరాల్లో సాగు చేశారు.
అన్ని పంటలు కలిపి సాధారణ
సాగు విస్తీర్ణం ఇలా..
అన్ని పంటలు కలిపి సాధారణ సాగు విస్తీర్ణంతో ఇప్పటి వరకు సాగైనా విస్తీర్ణం చూస్తే వరంగల్ జిల్లాలో 84.42 శాతం, హనుమకొండ జిల్లాలో 80.50, మహబూబాబాద్ జిల్లాలో 96.44, ములుగు జిల్లాలో 68.25, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 90.50 శాతం, జనగామ జిల్లాలో 73.56 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
ప్రధాన పంటల సాగు ఇలా..
ప్రధాన పంటలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 8,78,376 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 5,10,100 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 6,89,635 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం మొత్తం 64,906 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 63,375 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 95,979 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి మొత్తం సాధారణ విస్తీర్ణం 5,79,863 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 5,91,372 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 5,00,412 ఎకరాల్లో సాగైంది.
వరంగల్ జిల్లాలో అత్యధికం
మిగతా జిల్లాల్లో సాధారణం
ఊపందుకున్న పంటల సాగు