
దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..
● రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీ..
● వ్యక్తి దుర్మరణం
బచ్చన్నపేట : దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఓ వ్యక్తి అనంతలోకాలకు చేరాడు. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో దుర్మర ణం చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా బ చ్చన్నపేట మండలం బండనాగారం సమీపంలో జరిగింది. ఎస్సై అబ్దుల్ హమీద్, మృతుడి కుటుంబ సభ్యులు కథ నం ప్రకారం.. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రా మానికి చెందిన మలిపెద్ది సత్యనారాయణ (53) కిరాణా షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం తన భార్య నాగలక్ష్మితో కలిసి తన బైక్‌పై కొడవటూరులోని సిద్ధేశ్వరాలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో తన భార్య నాగలక్ష్మిని స్వగ్రామానికి చెందిన వారు కా రులో రాగా అందులో ఎక్కించాడు. బైక్‌పై ఒక్కడే స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన మురుగంటి రంజిత్‌కుమార్ బైక్‌పై బండనాగారం నుంచి బచ్చన్నపేటకు వెళ్తూ లక్ష్మాపూర్ కమాన్ వద్ద ఎదురుగా సత్యనారాయణ బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను చికిత్స నిమిత్తం సిద్దిపేటకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కొనసాగుతున్న వరద ఉధృతి
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల ఉధృతి కొనసాగుతోంది. గురువారం కాళేశ్వరం వద్ద 12.180 మీటర్ల ఎత్తులో నీటిమట్టం పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహించింది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బ్యారేజీకి గోదావరి, ప్రాణహితల ద్వా రా 7.40లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోందని ఇరిగేషన్ ఇంజనీర్లు పేర్కొన్నారు.