
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
గంగారం: గ్రామాల ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాతీయ ఆరోగ్య మిషన్ కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ వరుణ్ విజయ్, డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. గురువారం గంగారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో పర్యటించారు. ఎన్‌హెచ్‌ఎం పరిధిలో జాతీయ కార్యక్రమాలు క్షయ, కుష్ఠు, మలేరియా, డెంగీ, బోదకాలు వ్యాధి, ఇమ్యూనైజేషన్ టీకాలు, మాతాశిశు ఆరోగ్య సంరక్షణపై సమీక్ష నిర్వహించారు. సబ్ సెంటర్ల పరిధిలోని ప్రజలకు కార్యక్రమాలు చేరుతున్నాయా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులు, దోమల లార్వాల కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి, అనంతరం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీపీఓ నిలో హన, పీహెచ్‌సీ వైద్యాధికారులు ప్రత్యూష, శ్రీకాంత్, ఆయుష్ వైద్యాధికారి సూర్యం, స్టాఫ్ నర్సు లక్ష్మి, హెచ్‌వీ రాణి, రాంబాబు, శ్రీరాములు, వనజ తదితరులు పాల్గొన్నారు.