
దోమల బెడద..
సాక్షి, మహబూబాబాద్: గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సరిగా చేపట్టడం లేదు. దీంతో ఇళ్ల మధ్య మురుగు నీరు నిల్వ ఉండి దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయి. డ్రెయినేజీల్లో మురుగు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా పంచాయతీ కార్మికులకు సక్రమంగా వేతనాలు రాకపోవడం, పంచాయతీ పాలకమండలి లేకపోవడం తదితర కారణాలతో పల్లెల్లో సరిగా పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదు. దీంతో ప్రజలు రోగాల బారిన పడి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.
డీజిల్ భారంతో ట్రాక్టర్ మూలకు..
పల్లెలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచేందుకు గత ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీకి చెత్తను ఎత్తేందుకు ట్రాక్టర్లు, చెట్లకు నీళ్లు పోసేందుకు ట్యాంకర్లు కొనుగోలు చేసింది. ఇలా జిల్లాలో గతంలో ఉన్న 461 గ్రామ పంచాయతీల్లో 456 జీపీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. చిన్న చిన్న మరమ్మతులు చేసేందుకు కూడా నిధులు లేకపోవడంతో 395 ట్రాక్టర్లు మాత్రమే నడుస్తున్నాయి. 61 ట్రాక్టర్లు మూలన పడేశారు. పనిచేసే ట్రాక్టర్లు కూడా రోజు తీస్తే డీజిల్‌కు రూ. 500 మేరకు ఖర్చు అవుతోందని వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే తీసి మూలన పెడుతున్నారు. దీంతో కాల్వల్లో తొలగించిన చెత్తా చెదారం రోడ్డు పక్కనే పడేయడం, చిన్నపాటి వర్షం వచ్చినా అంతా చెల్లాచెదురై దుర్వాసన వెదజల్లుతోంది.
నిధుల లేమి..
గ్రామ పంచాయతీల పాలక మండలి పదవీకాలం ముగిసి ఏడాదిన్నర గడుస్తోంది. దీంతో గ్రామాలను పట్టించుకునే వారు కరువయ్యారు. సర్పంచ్‌లు ఉన్నప్పుడు గ్రామంలోని పారిశుద్ధ్య పనులకోసం ఏదో ఒక రూపంలో నిధులను తీసుకొచ్చి ఖర్చుచేసేవారు. కానీ ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులే మొత్తం భారం మోయాల్సి వస్తోంది. గతంలో బ్లీచింగ్, ఇతర ముగ్గులు పోయడం, ట్రాక్టర్ డీజిల్, పండుగలకు చేసిన ఖర్చులు.. ఇలా మొత్తం ఒక్కో కార్యదర్శికి రూ. 3లక్షలకుపైగా అప్పు అయినట్లు పలువురు కార్యదర్శులు వాపోతున్నారు. దీంతో కొత్త అప్పులు ఇచ్చే వారు లేక ఈ ఏడాది వర్షాకాలం నుంచి అత్యధిక పంచాయతీల్లో బ్లీచింగ్, ఫాగింగ్ కోసం కిరోసిన్, కెమికల్ కొనుగోలు చేయలేదు. దీంతో దోమల నివారణ మొక్కుబడిగా మారింది.
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. మెడికల్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. పనులు చేయిస్తున్నాం. పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లించాం. బ్లీచింగ్, కిరోసిన్ కొనుగోలు చేసుకోవాలని సూచించాం.
– హరిప్రసాద్, డీపీఓ
పల్లెల్లో అస్తవ్యస్తంగా
పారిశుద్ధ్య పనులు
నిధుల లేమితో బ్లీచింగ్, ఫాగింగ్ బంద్
డీజిల్ లేక వారంలో ఒక్కరోజే
ట్రాక్టర్‌తో చెత్త సేకరణ
కార్యదర్శులపై అప్పుల భారం

దోమల బెడద..

దోమల బెడద..

దోమల బెడద..