
పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చర్యలు
మహబూబాబాద్: పారిశుద్ధ్య సమస్య పరిష్కరిస్తామని మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ అన్నా రు. మున్సిపాలిటీ పరిధిలో నామమాత్రంగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, రోడ్లపై చెత్తాచెదారం, కాల్వలు శుభ్రం చేయకపోవడం తదితర విషయాలపై బుధవారం సాక్షి దినపత్రికలో ‘పడకేసిన పారిశుద్ధ్యం’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై కమిషనర్ స్పందించారు. ఈమేరకు పట్టణంలో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాలని, ప్రధానంగా రోడ్లపై చెత్తాచెదారం తొలగించాలని, కాల్వలు శుభ్రం చేయాలని ఆదేశించారు. దీంతో కంకరబో డ్, రెడ్డి బజార్‌తో పాటు పలు కాలనీల్లో రోడ్లపై ఉన్న చెత్తాచెదారం తొలగించారు. ఏ క్యాబిన్ రోడ్డులో కాల్వలను సిబ్బంది శుభ్రం చేశారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు కూడా రోడ్లపై చెత్తాచెదారం వేయవద్దని, సిబ్బందికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
కమిషనర్ రాజేశ్వర్

పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చర్యలు