
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
డోర్నకల్: జిల్లాలో యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ హెచ్చరించారు. మంగళవారం డోర్నకల్‌లో పర్యటించిన ఆయన జెడ్పీహెచ్‌ఎస్, రెండు ఫర్టిలైజర్ దుకాణాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ నిర్వహించారు. జెడ్పీహెచ్‌ఎస్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలు, కిచెన్‌షెడ్, మరుగుదొడ్లను శుభ్రంగా ఉచాలని ఆదేశించారు. ఏఐ, డిజిటల్ క్లాసుల ద్వారా విద్యార్థులకు నూతన టెక్నాలజీ గురించి వివరించాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా రైతుల వివరాలు నమోదు చేస్తూ యూరియాను విక్రయించాలని, కృత్రిమ కొరత సృష్టించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల్లో ఆన్‌లైన్ ఓపీ ఎంఎస్, ఫిజికల్ గోడౌన్ నిల్వలు, స్టాక్ వివరాలు కచ్చితంగా ఉండాలని ఆదేశించారు. నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య పెంచాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఏఓ విజయనిర్మల, మండల ప్రతేక అధికారి నర్సింహమూర్తి, తహసీల్దార్ ఇమ్మానీయల్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఎంపీడీఓ శ్రీనివాసనాయక్, ఏఓ మురళీమోహన్, సీఐ బి.రాజేష్, వైద్యాధికారి మేఘన తదితరులు పాల్గొన్నారు.