
నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి
జనగామ: జనగామ జిల్లాలో నీటి సంరక్షణ పెంచే దిశగా చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం సత్ఫలితాలు ఇచ్చిందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జలశక్తి అభియాన్‌లో భాగంగా రాజస్థా న్, తెలంగాణ రాష్ట్రంనుంచి జనగామ జిల్లా కలెక్టర్‌లతో మంగళవారం మంత్రిత్వశాఖ–జాతీయ జలమిషన్ డైరెక్టర్ అర్చన వర్మ ఆధ్వర్యంలో 49వ ఎడిషన్ వాటర్ సిరీస్ వెబ్‌నార్ సందర్భంగా జలశక్తి అభియాన్ ప్రగతిపై ఢిల్లీ నుంచి వర్చువల్‌గా వీడి యో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జనగామ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలసంరక్షణపై దృష్టి సారించడంతో వ్యవసాయ రంగంలో అధిక దిగుబ డులు సాధించడంతోపాటు వ్యవసాయేతర రంగా ల ఉత్పత్తులపై పట్టు సాధించామన్నారు. ఇంటింటికి ఇంకుడుగుంత నినాదంతో ఉద్యమంలా చేపట్టిన కార్యక్రమంతో ఐదు మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగినట్లు తెలిపారు. వరిసాగులో అత్యధి క దిగుబడి సాధించగా, ఇదే స్ఫూర్తితో వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగుపై ఫోకస్ పెట్టిన ట్లు తెలిపారు. 7వేల ఎకరాలకు పైగా పామాయిల్ తోటల సాగు లక్ష్యాన్ని చేరుకోగలిగినట్లు చెప్పారు. దేవాదుల ద్వారా ప్రాజెక్టులు, చెరువులకు నీటిని నింపినట్లు చెప్పారు. రెండేళ్లుగా మత్స్యకారులు చేపల పెంపకంతోపాటు మార్కెటింగ్ పరంగా రూ.300కోట్ల నుంచి రూ.350 కోట్ల మేర వ్యాపారంతో సాధికారత సాధించారన్నారు. అనంతరం అర్చన వర్మ మాట్లాడుతూ జనగామ జిల్లా పురోగాభి వృద్ధికి కృషి చేస్తున్న కలెక్టర్‌తోపాటు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
49వ ఎడిషన్ వాటర్ సిరీస్
వెబ్‌నార్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా
ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రోగ్రాం