
విద్యార్థులకు సాంకేతిక బోధన చేయాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉపాధ్యాయులు బోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయులకు డిజిటల్ లిట్రసి, ఏఐ పై సోమవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నవీన పద్ధతుల్లో విద్యబోధనను ప్రవేశపెడుతుందని తెలిపారు. సాంకేతిక అక్షరాస్యత, ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ విద్యా బోధన చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఐదుగురు ఉపాధ్యాయులకు శిక్షణ అందించామన్నారు. వారు జిల్లాలో 60 కాంప్లెక్స్ పాఠశాల స్థాయి నుంచి ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున మొత్తం 120 మంది ఉపాధ్యాయులకు జిల్లాలో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజ నాత్మకతను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, విద్యాశాఖ అధికారులు సంతోష్, అప్పారావు, ఏఎస్‌సీ, డీఆర్‌పీలు సంపత్, అశోక్, జగన్, యాదగిరి, విక్టోరియా తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్‌రెడ్డి