
మెకానికల్ వాకింగ్ రోబోట్..
కేసముద్రం: కేసముద్రం స్టేషన్ జెడ్పీ హైస్కూల్‌కి చెందిన 8వ తరగతి విద్యార్థులు గణేష్, కల్యాణ్, పవన్, అరవింద్ మెకానికల్ వాకింగ్ రోబోట్ తయారు చేసి, సోమవారం ప్రదర్శించారు. పీఎంశ్రీకి ఎంపికై న ఈ పాఠశాలకు ఇటీవల అటల్ టింకరింగ్ ల్యాబ్(ఏటీఎల్) మంజూరైంది. ఈ మేరకు ల్యాబ్‌కు త్రీడీ ప్రింటర్స్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్ వంటి పలు పరికరాలు వచ్చాయి. గైడ్ టీచర్ విజయ్ చందర్, మధు సహకారంతో విద్యార్థులు రోబోట్ అసెంబ్లింగ్ చేయడం నేర్చుకున్నారు. కాగా, మెకానికల్ వాకింగ్ రోబోట్ నడుస్తుంటే తోటి విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.
తయారు చేసిన కేసముద్రం స్టేషన్
జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు

మెకానికల్ వాకింగ్ రోబోట్..