
వాగులో పడి మహిళ మృతి
ఎస్‌ఎస్‌తాడ్వాయి : వాగులో పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సొగలం గౌరమ్మ(45) మతిస్థిమితం కోల్పోయింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కుటుంబీకులు తలుపులు తెరిచి నిద్రించారు. సోమవారం ఉదయం నిద్ర లేచి చూడగా గౌరమ్మ కనిపించలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం గాలించగా ఇంటి సమీపంలో ఉన్న తూముల వాగులో పడి మృతి చెంది కనిపించింది. రాత్రి సమయంలో మూత్ర విసర్జనకు వెళ్లి వాగులో పడి మృతి చెందిందనే కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.