
అధికారులు నివేదికలు అందించాలి
మరిపెడ రూరల్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారు ఆకేరు వాగు బ్రిడ్జి, నెర్రెలుబారిన ఎడ్జెర్ల పెద్ద చెరువును ఆయన ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మండలంలోని సమస్యాత్మక ప్రాంతాలను తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలను అందజేస్తున్నామన్నారు. విపత్తు నివారణ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మండల ప్రత్యేక అధికారి కిరణ్‌కుమార్, తహసల్దార్ కృష్ణవేణి, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, ఇరిగేషన్ ఏఈ శ్రీకాంత్, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
అప్రమత్తత అవసరం
బయ్యారం: అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ సూచించారు. మండలంలోని నామాలపాడు లోలెవల్ వంతెన, బయ్యారం పెద్దచెరువు అలుగులు, సత్యనారాయణపురం సమీపంలో నీటమునిగిన లోలెవల్ బ్రిడ్జిని ఆదివారం పరిశీలించారు. అదేవిధంగా డీఎస్పీ తిరుపతిరావు బయ్యారం పెద్దచెరువు అలుగులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ విజయలక్ష్మి, గార్ల–బయ్యారం సీఐ రవికుమర్, ఎస్సై తిరుపతి, ఇరిగేషన్ ఏఈ అఖిల తదితరులు ఉన్నారు.