
ప్రమాదాల నివారణకు ప్రత్యేక కృషి
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
తొర్రూరు రూరల్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని పాలకేంద్రం వద్ద జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో చిన్నచిన్న గుంతలు పెద్దగా మారి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు కృషి చేసినట్లు చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లపై గుంతలు లేకుండా ఎప్పటిప్పుడు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝూన్సీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బ్లాక్, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.