
పాకాల ఏటి వరద ఉధృతి పరిశీలన
గార్ల: గార్ల సమీపంలో చెక్‌డ్యామ్ పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల ఏరును బుధవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పరిశీ లించారు. పాకాల ఏటి చెక్‌డ్యామ్ వద్ద ప్రమాదాలను నివారించేందుకు రహదారికి అడ్డుగా బారికేడ్లు ఏర్పాటు చేసి డ్యూటీ పోలీస్‌ను నియమించాలని స్థానిక ఎస్సై రియాజ్‌పాషాను ఆదేశించారు. ఏరు ఉధృతి తగ్గేంత వరకు పగలు, రాత్రి వేళల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే తానే స్వయంగా హాజరవుతానని ఎస్పీ హామీ ఇచ్చారు. ప్రతీరోజు వరద ఉధృతి ఫొటోలను ఎస్పీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సీఐ రవికుమార్, ఎస్సైలు ఎస్‌కె రియాజ్‌పాషా, తిరుపతిరావు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
సంప్రదాయాలను కాపాడుకోవాలి
గూడూరు: బంజారాలు తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో మండల తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన తీజ్ నవరాత్రి వేడుకలు బుధవారం ముగిశాయి. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై తీజ్ వేడుకల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం గోధుమ నారు బుట్టలను యువతులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు తలపై పెట్టుకొని సంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం సమీప పాకాలవాగులో గోధుమ నారు బుట్టలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతిని ధులు ధర్మానాయక్, వాల్యానంద స్వామి, బాలూనాయక్, లక్ష్మణ్‌నాయక్, గోపినాథ్, పెద్దలు పాల్గొన్నారు.
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
గార్ల: ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) విజయనిర్మల హెచ్చరించారు. బుధవారం గార్ల, పుల్లూరు గ్రామాల్లో పలు ఎరువుల దుకా ణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాస్ యంత్రాలతోనే ఎరువుల అమ్మకాలు జరపాలని, నిబంధనలు పాటించని డీలర్లపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. లైసెన్స్‌లో ఓఫారం పొందుపర్చిన ఎరువులనే రైతులకు అమ్మాలని, స్టాక్‌బోర్డులో ఎరువుల నిల్వ లు, ధరలు రైతులకు కనబడే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. యూరియాకు బదులు నానో యురియా పంటలకు వాడాలన్నారు. డీఏఓ వెంట ఏఓ కావటి రామారావు, ఏఈఓ కిరణ్, రైతులు ఉన్నారు.
రోడ్డుపై నాటు వేసి నిరసన
బయ్యారం: బురదమయమైన రోడ్డుపై స్థానికులు బుధవారం నాటు వేసి వినూత్న నిరసన తెలిపారు. బయ్యారంలోని బండ్లమాంబ ఆలయ సమీపంలో ప్రధానరహదారి బురదమయంగా మారడంతో ఆ ప్రాంత వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నాటు నాటువేసి నిరసన తెలుపగా.. విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపతి అక్కడికి వెళ్లారు. స్థానికులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో వరినారును తొలగించారు.

పాకాల ఏటి వరద ఉధృతి పరిశీలన

పాకాల ఏటి వరద ఉధృతి పరిశీలన

పాకాల ఏటి వరద ఉధృతి పరిశీలన