
‘భూ భారతి’ దరఖాస్తులను పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
దంతాలపల్లి: భూభారతి దరఖా స్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్, సిబ్బందిని భూభారతి దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. తహసీల్దార్ సునీల్‌కుమార్, ఆర్‌ఐ రాజు, డీటీ శ్రీలత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి
మహబూబాబాద్: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష, బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు.