
ముంపు బాధితులకు పునరావాసం కల్పిస్తాం
మరిపెడ రూరల్: గత ఏడాది ఆకేరు వాగు ఉధృతితో మండలంలోని సీతారాంతండా, ఉల్లెపల్లి, బాల్నిధర్మారం గ్రామాల మంపు బాధితులకు పునరావాసం కల్పిస్తామని తొర్రూరు ఆర్డీఓ గణేష్ అన్నారు. ముంపు గ్రామాల పరిస్థితిపై మంగళవారం సాక్షి దినపత్రికలో ‘నెరవేరని హామీ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తొర్రూ రు ఆర్డీఓ గణేష్ బుధవారం మండలంలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద ఆకేరు వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా సీతారాంతండా బాధిత గిరిజనులతో ఆర్డీఓ మాట్లాడారు. ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటుందని, ఎవరు కూడా అధైర్యపడొద్దనిసూచించారు. ముందస్తు చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతంలో పునరావాసం కల్పిస్తామని వారికి భరోసా కల్పించారు. మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ముంపు బాధితులకు పునరావాసం కల్పిస్తాం