
త్రికూటాలయాల నిర్మాణాలు అద్భుతం
● కాకతీయ వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్
● ముగిసిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్
విద్యారణ్యపురి : కాకతీయుల త్రికూటాలయాల నిర్మాణాలు అద్భుత శిల్పకళావైభవానికి నిదర్శనమని కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులుగా ‘కాకతీయ టెంపుల్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ గురువారం ముగిసింది. ఈ ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయుల త్రికూటాలయాలు శివకేశవుడు, సూర్యదేవ ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయన్నారు. బడంగ్‌పేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ కాకతీయుల దేవాలయాల శిల్పకళ ప్రసిద్ధిగాంచిందన్నారు. గంభీరావుపేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. విజయలక్ష్మి మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళలకు నిలయం రామప్పదేవాలయం అన్నారు. అనంతరం హనుమకొండ ప్రభుత్వ పింగిళి డిగ్రీ, పీజీ కాలేజి ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి వర్ధన్నపేట, కేడీసీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పోచయ్య, జి. శ్రీనివాస్, టీహెచ్‌సీ ఫార్మర్ జనరల్ సెక్రటరీ ఎం. వీరేందర్, హెరిటేజ్ యాక్టివిస్ట్ ఆర్య, ఈవర్క్‌షాప్ కన్వీనర్ కొలిపాక శ్రీనివాస్, వైస్‌ప్రిన్సిపాల్ జి. సుహాసిని, అకడమిక్ కోఆర్డినేటర్ ఎం. అరుణ, ఐక్యూఏసీకోఆర్డినేటర్ సురేశ్‌బాబు మాట్లాడారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, చరిత్రకారులకు అతిథుల చేతులమీదుగా సరిఫికెట్లు అందజేశారు.
వాగులో గల్లంతైన ఆశ వర్కర్ మృతి
వెంకటాపురం(కె): వాగులో గల్లంతైన ఆశ వర్కర్ మృతి చెందింది. ఈఘటన మండల పరిధిలోని పాత్రాపురం జీపీ పరిధి లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆశ వర్కర్ ఇర్ప లక్ష్మి(60) బుధవారం సాయంత్రం తన కుమారుడు రమేశ్ పశువులను మేపేందుకు లక్ష్మీపురం నుంచి మోట్లగూడెం గ్రామానికి బండల వాగు దాటి వెళ్తున్నాడని తెలిసి అతడి వెనుక వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వాగు ఉధృతిలో కొట్టుకుపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వాగులో గాలించగా గురువారం ఉదయం లక్ష్మి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

త్రికూటాలయాల నిర్మాణాలు అద్భుతం