
సంతానం కలగడం లేదని..
● వ్యక్తి ఆత్మహత్య
సంగెం: సంతానం కలగడం లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగెం మండలం వంజరపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర్య రామారావు(47)కు 25 ఏళ్ల క్రితం విజయతో వివాహం జరిగింది. సంతానం కలగకపోవడంతో రామారావు నిత్యం మనస్తాపానికి గురయ్యేవాడు. దీనిపై భార్య విజయ.. రామారావుకు ధైర్యం చెప్పుతుండేది. ఈ క్రమంలో గురువారం పురుగుల మందు తాగగా గ్రామస్తురాలు మోర్తాల స్నేహ చూసి విజయకు చెప్పింది. దీంతో రామారావును హుటాహుటిన 108లో ఎంజీఎం తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.