
పాముకాటుతో మహిళ మృతి
కురవి: పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని తిర్మలాపురంలో చోటు చేసుకుంది. ఎస్సై గండ్రాతి సతీశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూల సుజాత(35) మార్చి 10వ తేదీన మొక్కజొన్న చేనులో పనిచేస్తుండగా పాముకాటు వేసింది. దీంతో కుటుంబసభ్యులు మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లింది. దీంతో ఏప్రిల్ 2వ తేదీన హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఏప్రిల్ 5వ తేదీన మళ్లీ మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలి భర్త రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.