
కలగానే కళాక్షేత్రం?
కవులు, కళాకారుల కోట..
సాక్షి, మహబూబాబాద్: నాటి స్వాతంత్య్ర పోరాటం నుంచి.. తొలి, మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయడంలో కవులు, రచయితలు, కళాకారుల పాత్ర కీలకమైనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే మానుకోటకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జిల్లా కేంద్రంలో కళాకారుల ప్రదర్శనలకు వేదిక లేకపోవడం శోచనీయం. వేదిక నిర్మాణం కోసం పార్టీలు, పాలకులు ఒక్క అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారే తప్ప.. పనులు చేపట్టలేదు.
అడుగు పడినట్లే పడి..
జిల్లాలో ప్రముఖ కవి దాశరథి పేరిట కళాక్షేత్రం నిర్మించాలనే ఆలోచన దశాబ్దకాలం క్రితమే వచ్చింది. కాగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో మానుకోట పట్టణంలోని శిథిలావస్థకు చేరుకున్న ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయం కూల్చివేసి వేరోచోట అవసరాలకు అనుగుణంగా కొత్త భవనం నిర్మించా లని ఆలోచించారు. తహసీల్దార్ కార్యాలయం స్థానంలో కళా క్షేత్రం నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు. అప్పటి సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మానుకోట మున్సిపాలిటీకి రూ.100కోట్లు తన ప్రత్యేక నిధుల నుంచి కేటాయిస్తున్నామని ప్రకటించారు. ఈ నిధుల వినియోగంలో బీఆర్‌ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలతో జాప్యం జరిగింది. చివరకు రూ. 5కోట్లు కళాభవన్ నిర్మాణం కోసం కేటాయించినట్లు ప్రకటించారు. మున్సిపాలిటీలో పాలకమండలి ఆమోదం కూడా తెలిపింది. ప్రతిపాదనలు తయారు చేశారే తప్ప పనులు ప్రారంభించలేదు. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చి.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ కళాభవన్ నిర్మాణ ప్రతిపాదన మరుగున పడిపోయింది.
కళాక్షేత్ర భవన నిర్మాణానికి పడని అడుగులు
ప్రతీసారి ఎన్నికల హామీగా మారుతున్న వైనం
కళాకారుల ప్రదర్శనలకు తప్పని తిప్పలు
పాలకులు దృష్టి పెట్టాలని వినతి
కవులు, కళాకారుల కోట..
నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో తమ రచనల ద్వారా నవాబుకు వణుకు పుట్టించిన కవి, రచయితలు దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యుల పుట్టినిల్లు మా నుకోట. ‘మానుకోట నా చందమామ’ అంటూ వారికి ఈ ప్రాంతంపై ఉన్న ప్రేమను చాటారు. అలాగే కవి, రచయి త జయరాజు ప్రజా చైతన్యమే లక్ష్యంగా సింగరేణి కా ర్మికుల హక్కులు, నిరక్షరాస్యత, సారా నిర్మూలన ఉద్య మం, కులవ్యవస్థ నిర్మూలన, ఇప్పుడు ప్రకృతి పరిరక్షణ మొదలైన అంశాలపై రచనలు చేస్తున్నారు. ఇక సినీ రంగంలో భారవి, ఎన్నో జానపద కళారూపాలకు ఈ ప్రాంత క వులు ప్రాణం పోశారు. అయితే వీరి రూపాలు ప్రదర్శించడం, కొత్త కళాకారులను పరిచయం చేసి ప్రోత్సహించేందుకు కళావేదిక లేకపోవడం లోటుగా మారింది.