
ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం
● టీపీఆర్‌టీయూ రాష్ట్ర నూతన
అధ్యక్షుడు మన్నె చంద్రయ్య
విద్యారణ్యపురి: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి పోరాడుతామని టీపీఆర్‌టీయూ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మన్నె చంద్రయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ ప్రకటించాలని, 317 జీఓతో నష్టపోయిన ఉపాధ్యాయులకు స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని, రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల్లో 10 వేల పీఎస్ హెచ్‌ఎం పోస్టులు మంజూరు చేయాలని, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి అమలు చేయాలని కోరారు. ఇటీవల తాత్కాలికంగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ మళ్లీ త్వరితగతిన చేపట్టాలని పేర్కొన్నారు.
పోగొట్టుకున్న
బంగారం అప్పగింత
హన్మకొండ కల్చరల్ : వరంగల్ భద్రకాళి దేవాలయంలో ఓ భక్తురాలు పోగొట్టుకున్న బంగారాన్ని సిబ్బంది ఆమెకు అప్పగించారు. ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ భక్తురాలి అర్ధతులం చెవికమ్మ ఆలయ ప్రాంగణంలో పడిపోయింది. దీనిని గమనించిన ఓ వ్యక్తి ఆ ఆభరణాన్ని ఆలయ పర్యవేక్షకుడు అద్దంకి విజయ్‌కుమార్‌కు అందజేయగా ఆయన భక్తురాలికి అప్పగించారు. దీంతో భక్తురాలు.. ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
బైక్ అదుపు తప్పి
యువకుడి దుర్మరణం
● మరొకరి పరిస్థితి విషమం
● గణపురం సమీపంలో ఘటన
గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రం సమీపంలోని కోట కాల్వ వద్ద బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గణపురం ఎస్సై రేఖాఅశోక్ కథనం ప్రకారం.. భూపాలపల్లికి చెందిన దాసరి జగదీశ్(24) ఏసీ టెక్నీషియన్‌గా, తన స్నేహితుడు మర్వికుసుముదార్ జగదీశ్ సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు ఆదివారం సెలవు సందర్భంగా ఇద్దరు బైక్‌పై రామప్పకు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్నారు. ఈ క్రమంలో గణపురం మండలకేంద్రం శివారు కోట కాల్వ వద్ద బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈఘటనలో దాసరి జగదీశ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో యువకుడు మర్వికుసుముదార్ జగదీశ్ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహంతోపాటు క్షతగాత్రుడిని 108లో భూపాలపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బెల్లం, పటిక పట్టివేత
కాజీపేట రూరల్: 80 కిలోల బెల్లం, 20 కిలోల పటికను కాజీపేట జంక్షన్‌లో పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట జీఆర్పీ ఎస్సై ఎం.అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా అనిల్ ఈ నెల 9వ తేదీన ఇంటి నుంచి బల్హార్షకు వెళ్లి తక్కువ ధరకు బెల్లం, పటిక కొని తిరిగి కాజీపేటకు చేరుకుని వేరే రైలులో మహబూబాబాద్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో సమాచారం మేరకు పోలీసులు రంగంలో కి దిగి అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. బెల్లం, పటికను స్వాధీనం చేసుకునున్నట్లు ఎస్సై అభినవ్ చేసినట్లు వివరించారు.

ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం

ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం

ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం