భూ సమస్యల పరిష్కారానికి ‘భూ భారతి’
మరిపెడ: గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించిందని తొర్రూరు ఆర్డీఓ గణేశ్‌బాబు అన్నారు. మరిపెడ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం డివిజన్ స్థాయి రెవెన్యూ సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్డీఓ హాజరై మాట్లాడుతూ.. భూ భారతి చట్టంపై సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 3నుంచి గ్రామాల్లో రెవెన్యూ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదమం 9 గంటల సాయంత్రం 4 గంటల వరకు ఆయా ఉమ్మడి గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో సదస్సులు నిర్వహించన్నుట్లు తెలిపారు. రైతులు భూ సమస్యలు ఉంటే సంబంధిత ఫారం నింపి అధికారులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట మండలాల తహసీల్దార్లు కృష్ణవేణి, మహబూబ్ అలీ, రమేశ్‌బాబు, మరిపెడ ఆర్‌ఐ శరత్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
తొర్రూరు ఆర్డీఓ గణేశ్‌బాబు


