కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా వివిధ తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ఐఆర్‌సీటీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డీఎస్‌జీపీ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూన్ 14 నుంచి జూలై 13వ తేదీ వరకు రెండు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ప్యాకేజీ–1 వివరాలు..
గంగా రామాయణ పుణ్యక్షేత్ర యాత్ర జూన్ 14న ప్రారంభమై 22వ తేదీ వరకు ఉంటుంది. ప్యాకేజీ–2 వివరాలు..
సికింద్రాబాద్ నుంచి వయా కామారెడ్డి, నిజా మాబాద్ మీదుగా ఐదు జ్యోతిర్లింగ యాత్ర రైలు జూలై 5వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 9701360701, 9281030712, 9281495845, 9281030749, 9281030750 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
పుష్కరాల విజయవంతానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని సరస్వతీనది పుష్కరాల విజయవంతానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, భక్తులకు అభినందనలు తెలిపారు. విధుల్లో నిబద్ధత, సమగ్ర ప్రణాళిక, అవిశ్రాంత కృషితో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారన్నారు. పుష్కరాల సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన మీడియా ప్రతినిధులను అ భినందించారు. సమష్టి బాధ్యతతో నిర్వహించిన ఈ పుష్కరాలు మన భవిష్యత్ కార్యాచరణకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు


