మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలుకుదాం
హన్మకొండ: ఈనెల 27న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుని 31న వరంగల్‌కు రానున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలుకుదామని మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వై.కె.విశ్వనాథ్, ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేశ్, ఎంఎస్పీ జాతీయ నాయకుడు మంద కుమార్, నాయకులు ఎస్.నరేంద్రబాబు, మంద వెంకటేశ్వరరావు, బొడ్డు దయాకర్, బొర్ర భిక్షపతి, బుర్ర సతీశ్, పుట్ట రవి, పేరెల్లి ఎలీషా, దుడ్డు రామకృష్ణ, చేతల శివ, మంద వర్ధన్, కుమ్మరి శ్రీనాథ్, దావు ఆదిత్య పాల్గొన్నారు.
మంద కృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలుకుదాం


