పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల్లో తీవ్ర పోషణ లోపం, అతి తీవ్ర లోపం ఉన్న పిల్లలను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ అధి కారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యాక్షన్‌ప్లాన్‌తో ముందుకు వెళ్లాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సరిగా ఉండాలని, బాలల సంరక్షణ తదితర విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లల్లో అభివృద్ధి జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీడబ్ల్యూఓ ధనమ్మ, సీడీపీఓలు, శిరీష, నీలోఫర్, కమలా దేవి, ఎల్లమ్మ, లక్ష్మి, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


