రజతోత్సవ సభతో బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం
● మాజీ మంత్రి సత్యవతి రాఽథోడ్
మహబూబాబాద్: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, ఆ సభ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం గూడూరు మండలం దామరవంచ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తి గా విఫలమైందన్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారన్నారు. రజతో త్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు యాళ్ల మురళీధర్‌రెడ్డి, లూనావత్ అశోక్, నవీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
నర్సింగ్ కళాశాల తనిఖీ
నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు సోమవారం తనిఖీ చేశారు. నర్సింగ్ విద్యార్థులకు అందుతున్న క్లినికల్ ట్రైనింగ్, తరగతులు, ల్యాబ్‌లు, మ్యూజియం, పరీక్షలు, మౌలిక వసతులు, బిల్డింగ్ తదితర అంశాలను పరిశీలించారు. కళాశాలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థుల క్లినికల్ ట్రైనింగ్, వార్డులను పరిశీలించారు. అర్బన్ హెల్త్ సెంటర్‌కు వెళ్లి నర్సింగ్ విద్యార్థుల ట్రైనింగ్ గురించి తెలుసుకున్నారు. అనంతరం నర్సింగ్ కళాశాలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కేటాయించిన బిల్డింగ్, నర్సింగ్ కళాశాలలో ఉన్న ఫ్యాకల్టీ, అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లీలా తదితరులు ఉన్నారు. అలాగే మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
ఫౌంటేన్ కాదు..
భగీరథ పైపులైన్ లీకేజీ
కురవి: ఇది ఫౌంటేన్ అనుకుంటే పొరపాటే.. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ. మండల కేంద్రం శివారు పెద్ద చెరువు సమీపంలో 365 జాతీయ రహదారి పక్కన భగీరథ పైపులైన్ లీకేజీతో నీళ్లు ఫౌంటేన్‌లా విరజిమ్ముతూ సోమవారం వృథాగాపోయాయి. దీంతో ఆ రహదారి వెంట వెళ్లే వాహనదారులు వృఽథాగా పోతున్న నీటిని చూసి అధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శించారు. తాగునీటిని వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై భగీరథ సూపర్‌వైజర్‌ను వివరణ కోరగా వేరే చోట పైపు పగిలిపోవడంతో ఎయిర్‌వాల్వ్‌ను విప్పి నీటిని బయటకు పంపించి పగిలిన పైపు మరమ్మతులు చేసినట్లు సూపర్‌వైజర్ వెంకటరెడ్డి తెలిపారు.
గణితంతోనే
అన్ని విభాగాల్లో పరిశోధనలు
● నిట్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ ఉమామహేశ్
కాజీపేట అర్బన్: గణితశాస్త్రం అన్ని విభాగాలతో ముడిపడి ఉంటుందని, వివిధ విభాగాల్లో నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు గణితంతోనే సాధ్యమని నిట్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ ఎన్వీ.ఉమామహేశ్ తెలిపారు. నిట్ వరంగల్ సెమినార్‌హాల్ కాంప్లెక్స్‌లోని హామిబాబా హాల్‌లో సోమవారం మ్యాథమెటికల్ డిపార్ట్‌మెంట్, ఐఐటీ బాంబే నేషనల్ సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై సౌజన్యంతో వారం రోజుల టీచర్స్ ఎన్‌రీచ్‌మెంట్ వర్క్‌షాప్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మా ట్లాడారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020కి అనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. వారం రోజుల వర్క్‌షాప్ వేదికగా నిలవాలన్నారు. నిట్ మ్యా థమెటిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ సెల్వరాజ్, ప్రొఫెసర్లు రాజశేఖర్, శ్రీనివాసరావు ఉన్నారు.
రజతోత్సవ సభతో బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం


