
సేవాలాల్ మార్గం అనుసరణీయం
మరిపెడ: సంత్ సేవాలాల్ మహరాజ్ సమాజానికి చేసిన సేవలు మరిచిపోలేనివని, ఆయన మార్గం అనుసరణీయమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. ఆదివారం మరిపెడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో డోర్నకల్ నియోజకవర్గస్థాయి సంత్ సేవాలాల్ భోగ్ భండారో కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మానుకోట, ఖమ్మం ఎంపీలు పోరిక బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. సాధు పూజారులు ముందుగా బెల్లం, బియ్యం, పప్పు, నెయ్యిని ఉపయోగించి తయారు చేసిన పదార్థాలను సంత్ సేవాలాల్‌కు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప విప్లవ చైతన్యమూర్తి సంత్ సేవాలాల్ మహరాజ్ అని కొనియాడారు. దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్తల్లో ఒకరని పేర్కొన్నారు. ముఖ్యంగా భోగ్ భండారో చేయడంలో గొప్ప శాసీ్త్రయత దాగి ఉందన్నారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. బంజారాల జీవనం ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలు, భాషను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. బంజారాలకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బంజారులు కృషి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశిరాంనాయక్, జిల్లా నాయకులు వంటికొమ్ము యుగేందర్‌రెడ్డి, నూలక అభివన్‌రెడ్డి, మండలాల అధ్యక్షులు రఘువీరరెడ్డి, అంబటి వీరభద్రం, భట్టునాయక్, మారబోయిన వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవినాయక్, మానుకోట మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్‌నాయక్, కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ ఐలమల్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్
ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ భోగ్ భండారో
హాజరైన ఎంపీలు బలరాంనాయక్, రఘురాంరెడ్డి