కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్ అర్బన్: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ డీ.ఎస్. చౌహాన్‌తో కలిసి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో యాసంగి ధాన్యం కొనుగోలు, సన్న బియ్యం పంపిణీ, తాగునీటి సరఫరా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. అనంతరం కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మే మొదటి వారం నుంచి వరికోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా అర్హతగల ప్రతి లబ్ధిదారుడికి బియ్యం సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నల్లా కనెక్షన్ లేనిప్రాంతాలకు వాటర్ ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.వీరభ్రహ్మచారి, డీఆర్డీఓ మధుసూదనరాజు, జిల్లా అధికారులు వెంకటేశ్వర్లు, విజయ నిర్మల, కృష్ణారెడ్డి, హరిప్రసాద్, సురేష్, మరియన్న, ప్రేమ్‌కుమార్, పాల్గొన్నారు.
ఆకాంక్ష బ్లాకుల
అభివృద్ధికి సహకరించాలి
దేశంలోని ఆకాంక్ష ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాం డెల్టా ర్యాంకింగ్‌లో జిల్లాలోని గంగారం మండలం దేశంలో మొదటిస్థానం సాధించిందని, అందుకు కృషి చేసిన అధికారులను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అభినందించారు. ఈమేరకు కలెక్టర్‌లో శనివారం జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, అభివృద్ధి భాగస్వాములతో ప్రారంభించబడిందన్నారు. వెనుకబడిన బ్లాకులలో జీవన ప్రమాణాలు మెరుగుపరచడం లక్ష్యంగా ఆకాంక్ష బ్లాకుల కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్
సామాన్యులకు అందుబాటులో ‘భూ భారతి’
చిన్నగూడూరు: సామాన్యులకు అందుబాటులో సేవలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టం ప్రవేశపెట్టిందని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. శనివారం మండలంలోని ఉగ్గంపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. భూ భారతి పోర్టల్ ద్వారా క్షేత్రస్థాయిలో భూ సమస్యలను పరిష్కరింవచ్చన్నారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి మాట్లాడుతూ.. నూతన చట్టం ద్వారా సమస్య సులభంగా పరిష్కారమవుతుందన్నారు. రైతులు కృష్ణారెడ్డి, వెంకన్న సందే హాలకు కలెక్టర్, అదనపు కలెక్టర్ సమాధానాలు, పరిష్కార మార్గాలు వివరించారు. సదస్సులో భా గంగా రెవెన్యూ డివిజినల్ అధికారి గణేష్ భూ భారతి కొత్త ఆర్వోఆర్ చట్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో రైతులకు అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా.. మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. డీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారిని కృష్ణవేణి, తహసీల్దార్ మహబూబ్ అలీ పాల్గొన్నారు.


