
బాలుడి వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా చర్యలు
మహబూబాబాద్: బాలుడి కాలుపై వాత పెట్టిన విషయంలో వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీడీపీఓ శిరీష పేర్కొన్నారు. జిల్లా కేంద్రం సిగ్నల్ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆయా భద్రమ్మ కత్తిని స్టౌవ్‌పై వేడి చేసి మనుదీప్(ఐదేళ్లు) అనే బాలుడి కాలుపై వాత పెట్టిన ఘటపై ఈనెల 16న కేంద్రం ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై సీడీపీ శిరీష, సూపర్ వైజర్ కవిత విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీడీపీఓ శిరీష మాట్లాడుతూ గత శనివారం బాలుడి నానమ్మ ఫోన్ చేసి గత గురువారం ఆయా భద్రమ్మ కత్తితో తన మనుమడి కాలుపై వాత పెట్టిందని ఫోన్‌లో తెలిపారన్నారు. వెంటనే ఆ కేంద్రం సందర్శించి ఘటన వివరాలు తెలుసుకోవాలని సూపర్ వైజర్ కవితను ఆదేశించామన్నారు. అయితే అంగన్‌వాడీ టీచర్ సరిత ఈనెల 14,15న సెలవులో ఉండడంతో విచారణ పూర్తి కాలేదన్నారు. దీంతో ఈనెల 16న, 17న విచారణ చేశామన్నారు. ఆ బాలుడిని వైద్యపరీక్షల కోసం జిల్లా ప్రధాన వైద్యశాలకు పంపామన్నారు. దీనిపై త్వరలో రిపోర్ట్ ఇస్తామని చెప్పారన్నారు. వైద్యులు రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో వాత అని తేలితే చర్యలు తప్పవన్నారు.
సీడీపీఓ శిరీష