మేడారం, ఏటూరునాగారం మధ్య పులి జాడలు
ఏటూరునాగారం : ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం అడవుల మధ్య పులి సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని అటవీశాఖ డివిజనల్ అధికారి రమేశ్ శనివారం తెలిపారు. ఏటూరునాగారం నుంచి తాడ్వాయి మండలంలోని మేడారం, బయ్యక్కపేట అడవుల్లో సిబ్బందితో కలిసి పులి జాడ కోసం వెతుకుతున్నామన్నారు. మహాదేవ్‌పూర్ ప్రాంతం బూడిదపెంట గొత్తికోయగూడెంలో ఓ ఆవును చంపి ఇటువైపు వచ్చినట్లు అక్కడి అటవీశాఖ అధికారుల సమాచారం ఉందన్నారు. ఈ మేరకు అడవులకు దగ్గరలోని ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఎవరూ అడవులకు వెళ్లొద్దని సూచించారు. పులి ఆనవాళ్లు, జాడలు కనిపిస్తే వెంటనే అటవీశాఖకు తెలపాలన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారులు అబ్దుల్ రెహమాన్, అఫ్సరున్నిసా తోపాటు సెక్షన్, బీట్ అధికారులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎఫ్‌డీఓ రమేశ్


