‘సీతారామ’ రీడిజైన్ అవినీతిపై విచారణ చేపట్టాలి
గార్ల: ఇల్లెందు నియోజకవర్గంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ గురువారం గార్లలో ఎమ్మె ల్యే కోరం కనకయ్యకు అఖిలపక్షం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఇల్లెందు, మహబూబా బాద్, డోర్నకల్, పాలేరు నియోజకవర్గాల ప్రజలకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రాజెక్టు చేపట్టారన్నారు. అయితే ఇల్లెందు, మహబూబాబా ద్, డోర్నకల్ నియోజకవర్గాలను విస్మరించి నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రాజెక్టు రీడిజైన్ చేశారని అఖిలపక్ష నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టు నీళ్లు ఇల్లెందు నియోజకవర్గానికి వచ్చేలా చూడాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో అఖిలపక్ష నాయకులు గంగావత్ లక్ష్మ ణ్‌నాయక్, జంపాల విశ్వ, సక్రు, కట్టెబోయిన శ్రీనివాస్, పెద్దవెంకటేశ్వర్లు, మురళి తదితరులు పాల్గొన్నారు.


