డేంజర్ జోన్ సమస్యలు పరిష్కరిస్తాం
మల్హర్: జెన్‌కో ఓపెన్‌కాస్ట్‌కు 500 మీటర్ల పరిధిలోని డేంజర్ జోన్‌లో ఉన్న ఇళ్ల సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని జెన్‌కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును మంగళవారం సందర్శించారు. ఓపెన్‌కాస్ట్ మైన్ లోపల పర్యటించి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న పని తీరు, ఓపెన్‌కాస్ట్ వ్యూప్యాంట్ ద్వారా డేంజర్ జోన్ ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఏఎమ్మార్ క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టు అధికారులతో సమావేశం నిర్వహించారు. 2024–25లో నిర్దేశించిన లక్ష్యాన్ని ఏఎమ్మార్ అధికారులను అడిగి తెలసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యం 25లక్షల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేరుకోవడంపై వారిని అభినందించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ.. జెన్‌కో పరిధిలోని భూ నిర్వాసితులు సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ పరిధిలోని ఇళ్ల సమస్యను పరిష్కరిస్తామని, నిర్వాసితులు ఆందోళన చెందొద్దని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏఎమ్మార్ ఎండీ మహేశ్‌రెడ్డి, సీఈఓ డీఎల్‌ఆర్‌కే ప్రసాద్, జెన్‌కో డైరెక్టర్లు లక్ష్మ య్య, కేటీపీపీ సీఈ శ్రీప్రకాశ్, జెన్‌కో ఏజెంట్ జీవన్‌కుమార్, జీఎం మోహన్‌రావు, అడిషనల్ కలెక్టర్ అశోకుమార్, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఏఎమ్మాఆర్ వైస్ ప్రెసిడెంట్లు విశ్వనాథ్‌రాజు, శ్రీధర్, ప్రాజెక్టు హెడ్ ప్రభాకర్‌రెడ్డి, జనరల్ మేనేజర్ కేఎస్‌ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా, జెన్‌కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియాకు పెద్ద తాడిచర్ల డేంజర్ జోన్‌లోని ఇళ్ల సమస్య పరిష్కరించాలని కోరుతూ నిర్వాసితులు తాండ్ర మల్లేశ్, ఇందారపు చంద్రయ్య, అశోక్‌రావు, రాజు, మొగిళి తదితరులు వినతిపత్రం అందజేశారు.
జెన్‌కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా


