నేర్చుకుంటేనే విజయం..
పోటీ పరీక్షల్లో విజయంసాధించాలంటే ఎంతో సాధన అవసరం. అందుకు దినపత్రికలు, కొంతమేర సెల్‌ఫోన్లు ఉపయోగపడుతాయి. ఇటీవల ఉమ్మడి జిల్లానుంచి అనేకమంది గ్రూప్–1, 2లో ఉద్యోగాలు సాధించారు. గ్రూప్–1లో శాయంపేట మండలం తహెరాపూర్‌కు చెందిన తేజస్వినీరెడ్డి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించింది. మహబూబాబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లికి చెందిన మే కల ఉపేందర్ రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించాడు. ‘ఏకాగ్రతతో చదువుతూ విజయం సాధించాలి.’అని సదరు ర్యాంకర్లు చెబుతున్నారు. సమయాన్ని వృథా చేయకుండా సరైన ఆలోచనలు చేస్తే వ్యాపారాల్లో లాభాలు గడిస్తూ విజయాన్ని సాధించవచ్చు.


