పాఠాలు | - | Sakshi
Sakshi News home page

పాఠాలు

Mar 28 2025 1:37 AM | Updated on Mar 28 2025 1:39 AM

మహబూబాబాద్‌
శుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025
కంప్యూటర్‌
నేడు కమిషనర్లతో ఫోన్‌ ఇన్‌

జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల వివరాలు

ప్రాథమిక

పాఠశాలలు

676

విద్యార్థులు

22,354

ప్రాథమికోన్నత

పాఠశాలలు

120

50మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు అవకాశం

జిల్లాలో 102 స్కూళ్ల గుర్తింపు

కంప్యూటర్లు సరఫరా చేసేందుకు కసరత్తు

మంచి పరిణామం అంటున్న విద్యానిపుణులు

విద్యార్థులు

8,879

సాక్షి, మహబూబాబాద్‌: మారుతున్న కాలంతోపాటు విద్యార్థుల మానసిక, చదువు సామర్థ్యాలను పెంచాలి. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తయారు చేయాలంటే అందుకు అనుగుణంగా బోధన చేపట్టాలి. ఇందుకోసం మౌలిక వసతులు కల్పించాలి. అప్పుడే లక్ష్యాలను సాధించవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) బోధన మొదలు పెట్టగా.. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను నేర్పించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం కనీసం 50 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసి కంప్యూటర్లు సరఫరా చేసేందుకు కసరత్తు చేశారు.

102 ప్రాథమిక పాఠశాలల గుర్తింపు..

కార్పొరేట్‌ ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేపట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం విద్యార్థులకు కంప్యూటర్లను అందుబాటులోకి తెస్తోంది. 50మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో మొత్తం 898 ప్రభుత్వ పాఠశాలల్లో 50,060 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 50 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ప్రాథమిక పాఠశాలలు 102 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పాఠశాలల్లో చదివే పది మంది విద్యార్థులను ఒక గ్రూప్‌గా చేసి వారికి ఇంటర్‌నెట్‌ సౌకర్యంతో కూడిన కంప్యూటర్‌ కేటాయిస్తారు. ఇలా పాఠశాలలో ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని కంప్యూటర్లు మంజూరయ్యే అవకాశం ఉంది. కాగా ప్రతీ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కనీసం ఐదు నుంచి పది కంప్యూటర్లు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

విద్యార్థిస్థాయికి తగిన బోధన...

ప్రస్తుత సమాజంలో సంవత్సరం నిండని పిల్లలు కూడా సెల్‌ఫోన్స్‌, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈక్రమంలో సాధారణ బోధన కాకుండా విద్యార్థులు ఇష్టంగా చదువుకునేందుకు కంప్యూటర్‌ బోధన దోహదపడుతుందని విద్యా నిపుణుల అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి వారికి ఇష్టమైన అంశాలను తీసుకొని బోధించేందుకు కంప్యూటర్‌ శిక్షణ దోహదపడుతుంది. అయితే ఇందుకోసం కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్న ఉపాధ్యాయుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలా చేయడం వల్ల చదువులో వెనకబడిన విద్యార్థులు కూడా కనీస సామర్థ్యాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా ఈ వేసవిలో పూర్తి చేసి నూతన విద్యా సంవత్సరం నుంచే పిల్లలకు కంప్యూటర్‌ పాఠాలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

ఉన్నత

పాఠశాలలు

102

మొత్తం

పాఠశాలలు

898

మహబూబాబాద్‌/తొర్రూరు: సాక్షి ఆధ్వర్యంలో నేడు(శుక్రవారం)మానుకోట మున్సిపల్‌ కమిషనర్‌ నోముల రవీందర్‌, తొర్రూరు మున్సిపల్‌ కమిషనర్‌ శాంతికుమార్‌లతో వేర్వేరుగా ‘ఫోన్‌ఇన్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఆయా మున్సిపాలిటీల పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, కుక్కలు, కోతుల బెడద తదితర సమస్యలపై ఫోన్‌చేసి కమిషనర్లతో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సమస్యలను ఈ కింద ఇచ్చిన సెల్‌ ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేసి తెలియజేయాలి.

పాఠాలు1
1/5

పాఠాలు

పాఠాలు2
2/5

పాఠాలు

పాఠాలు3
3/5

పాఠాలు

పాఠాలు4
4/5

పాఠాలు

పాఠాలు5
5/5

పాఠాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement