కలెక్టర్‌ సారూ.. కనికరించండి | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ సారూ.. కనికరించండి

Mar 11 2025 1:14 AM | Updated on Mar 11 2025 1:12 AM

సాక్షి, మహబూబాబాద్‌/మహబూబాబాద్‌: ‘మాకు నిలువ నీడలేదు.. గతంలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. మీరైనా కరుణించి ఇళ్లు మంజూరు చేయండి. మా తాతలకాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమి ధరణిలో తప్పు జరిగి వేరే వారి పేరున పడింది. ఆ పేరు మార్పిడి చేసి మా భూమి మాకు కేటాయించండి. మా ముగ్గురు కుమారులు ప్రయోజకులే.. కానీ నాకు, ముసలమ్మకు అన్నం పెట్టేవారు లేరు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా లాభం లేకపోయింది. మీరు సమయం ఇచ్చి నా బిడ్డలను పిలిపించి వృద్ధాప్యంలో ఉన్న మాకు అన్నం పెట్టించండి’ అని ఇలా ఎవరి సమస్యలను వారు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌కు చెప్పుకున్నారు.

దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌

ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌, అదనపు కలెక్టర్లు లెనిన్‌ వత్సల్‌ టొప్పో, కె.వీరబ్రహ్మచారి వినతులను స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వినతులు వెంటనే పరిష్కరించాలని, లేని యెడల కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. పెండింగ్‌ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. వినతులపై నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజావాణిలో 84 వినతులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన...

తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లింగారెడ్డి, నర్సింహారెడ్డి, సావిత్రమ్మ మాట్లాడుతూ.. తమకు వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొన్ని సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముత్తిలింగయ్య, కృష్ణమూర్తి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

సమాచారం లేక తక్కువగా దరఖాస్తులు..

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేశారు. అయితే సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి ఉందని తెలియక దరఖాస్తులు చాలా తక్కువగా వచ్చాయి. కేవలం 84మాత్రమే వచ్చాయి. ప్రజావాణి ఉందని సమాచారం ఉంటే దరఖాస్తుల సంఖ్య పెరిగేది.

రైతుభరోసా మంజూరు చేయాలి

మూడు సంవత్సరాలుగా రైతుభరోసా(రైతుబంధు) రావడం లేదు. తహసీల్దార్‌, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగినా స్పందించలేదు. కలెక్టర్‌ స్పందించి పత్రాలను పరిశీలించి రైతుభరోసా మంజూరు చేయాలి.

– ఎన్‌ సోమేశ్వర్‌, తొర్రూరు

పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలి

నాకు మూడు ఎకరాల భూమి ఉంది. నేటికీ పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదు. పట్టా భూమి అయినా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. వెంటనే పాస్‌పుస్తకం అందజేయాలి.

– బి.కిషన్‌, తానంచర్ల

గ్రామ శివారు రెడ్యాతండా, మరిపెడ

మూడు వారాల తర్వాత ప్రజావాణి నిర్వహణ

జిల్లా నలుమూలల నుంచి వచ్చి

వినతుల అందజేత

నెలల తరబడి తిరుగుతున్నా

సమస్యలకు దొరకని పరిష్కారం

పరిష్కరించాలని అర్జీదారుల వేడుకోలు

కలెక్టర్‌ సారూ.. కనికరించండి1
1/3

కలెక్టర్‌ సారూ.. కనికరించండి

కలెక్టర్‌ సారూ.. కనికరించండి2
2/3

కలెక్టర్‌ సారూ.. కనికరించండి

కలెక్టర్‌ సారూ.. కనికరించండి3
3/3

కలెక్టర్‌ సారూ.. కనికరించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement