
సాగు నీటి కాల్వను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులకు సరైన సమయంలో సాగు నీరందక ఇబ్బంది పడ్డారని, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం పాలకుర్తి మండలం కోమటిగూడెం, బోయినగూడెం, గూడూరు, కోతులబాద, తిర్మలగిరి, నర్సింగాపూర్ గ్రామాలకు సంబంధించిన ఎస్సారెస్పీ సాగు నీటి కాల్వలను(4ఎల్, 5ఎల్) పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రైతుల సమస్యలను విన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇటీవల ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న నాయకులను రైతులు గ్రామాల్లో తిరగనివ్వరని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, పులి గణేష్, జలగం కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మాజీ సర్పంచ్‌లు మాచర్ల పుల్లయ్య, అశోక్, శ్రీనివాస్, కమ్మగాని నాగయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.