
– 8లోu
మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా సీతారామచంద్రస్వామివారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీపార్క్ సమీపంలో రాములోరి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. రామాలయం నుంచి శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను రథంపై బ్యాండ్ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా గాంధీపార్క్ వేదిక వద్దకు తీసుకొచ్చి అధిష్టింపజేశారు. అర్చకులు గుడి రాధాకృష్ణమూర్తి, ముత్తేవి కృష్ణప్రసాద్, మారెపల్లి కౌశిక్‌శర్మ కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించి పులకించిపోయారు. శ్రీరామనామ స్మరణతో ఆప్రాంతమంతా మార్మోగింది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దంపతులు మురళీనాయక్–ఉమా, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి బలరాంనాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ వెంకన్న, కల్యాణోత్సవ కమిటీ బాధ్యులు మోహన్ రావు, రమేష్ బాబు, ఓంనారాయణ లోయ, ప్రోగ్రాం కన్వీనర్ గురునాథరావు ఉన్నారు.
న్యూస్‌రీల్
కల్యాణం.. కమనీయం
వైభవంగా రాములోరి పెళ్లి
హాజరైన ప్రజాప్రతినిధులు, భక్తులు
– మరిన్ని ఫొటోలు 9లోu


లక్ష్మణ సమేత కల్యాణ సీతారామచంద్రస్వామి

తలంబ్రాలు పోస్తున్న అర్చకులు


