విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Published Mon, Dec 18 2023 1:00 AM

- - Sakshi

డోర్నకల్‌: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం డోర్నకల్‌ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో జరిగింది. మండలంలోని అమ్మపాలెంలో పంటపొలాల వద్ద కరీంనగర్‌కు చెందిన సతీష్‌.. విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకుని హర్వెస్టర్‌కు వెల్డింగ్‌ పనులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురికాగా స్థానికులు వెంటనే సతీష్‌ను 108లో మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా విద్యుత్‌ స్తంభంపై గల తీగలు తొలగించేందుకు వెళ్లిన డోర్నకల్‌ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వంగూరి రాము (40) కూడా విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మతిస్థిమితం లేని

మహిళపై లైంగికదాడి

నల్లబెల్లి: ఓ కామంధుడు ఓ మతిస్థిమితం లేని మహిళపై పలుమార్లు లైంగికదాడికి పాల్ప డ్డాడు. ఈ ఘటన ఆల్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన ఓ మతిస్థిమితం లేని మహిళ(45) ఇంట్లో ఒంటరిగా ఉంది. దీంతో ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన కడివెండి కేదారి శనివారం ఇంట్లోకి ప్రవేశించి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళ కేకలు వేయడంతో కుటుంబీకులు ఘటనా స్థలికి చేరుకోగా వారిని చూసి కేదారి అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, కేదారి పలుమార్లు తనపై లైంగికదాడికి పాల్పడినట్లు మహిళ రోదిస్తూ కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో

భక్తులకు గాయాలు

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని వెంగ్లాపూర్‌ శివారులో జరిగింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఆదివా రం కారులో మేడారం వచ్చారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వెంగ్లాపూర్‌లో శివారులో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఐదుగురు భక్తుల్లో న లుగురు స్వల్పంగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన ట్లు తెలిసింది. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

రాము మృతదేహం
1/1

రాము మృతదేహం

Advertisement
 
Advertisement