అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు | Sakshi
Sakshi News home page

అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

Published Fri, Nov 17 2023 1:20 AM

-

మహబూబాబాద్‌/మరిపెడ రూరల్‌: జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. బుధవారం ఉపసంహరణ, ఫైనల్‌ జాబితా వెల్లడికాగా.. గురువారం గుర్తులు కేటాయించినట్లు మానుకోట, డోర్నకల్‌ ఆర్వోలు అలివేలు, నర్సింహారావు తెలిపారు.

మానుకోట నియోజకవర్గ

అభ్యర్థులు.. కేటాయించిన గుర్తులు..

గుగులోత్‌ శేఖర్‌–బీఎస్పీ(ఏనుగు గుర్తు), బానోత్‌ శంకర్‌నాయక్‌–బీఆర్‌ఎస్‌(కారు), భూక్య మురళీనాయక్‌–కాంగ్రెస్‌(హస్తం), జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌–బీజేపీ (కమలం), జాటోత్‌ చక్రవర్తి– ధర్మ సమాజ్‌ పార్టీ(బ్యాటరీటార్చ్‌), జాటోత్‌ బిచ్చానాయక్‌–ఎంసీపీఐ (కెమెరా), పోనక రాందాస్‌–రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ఇండియా(గ్యాస్‌స్టౌవ్‌), వట్టం ఉపేందర్‌–బహుజనముక్తి పార్టీ (మంచం), డివినాయక్‌ (ఫుట్‌బాల్‌), నూనావత్‌ రమేష్‌(ఉంగరం) బట్టు బిన్నమ్మ(కత్తెర), గుగులోత్‌ వెంకన్నకు(గన్నా కిసాన్‌) గుర్తు కేటాయించారు.

డోర్నకల్‌ నియోజకవర్గ

అభ్యర్థులు.. కేటాయించిన గుర్తులు..

గుగులోతు పార్వతి–బీఎస్పీ(ఏనుగుగుర్తు), డీఎస్‌ రెడ్యానాయక్‌–బీఆర్‌ఎస్‌(కారు), రాంచంద్రునాయక్‌–కాంగ్రెస్‌(హస్తం), భూక్య సంగీత(కమలం) గుర్తు కేటాయించారు. అలాగే స్వతంత్ర, రిజిస్టర్‌ పార్టీ అభ్యర్థులు గుగులోతు రవీందర్‌(కోట్‌ గుర్తు), తేజావత్‌ సోమన్న(రోడ్డు రోలర్‌), బాదావత్‌ రాజేష్‌(బ్యాట్‌), బానోతు లింగన్న(మి క్సీ), భూక్య మహేందర్‌(గన్న కిసాన్‌), వాంకుడోతు రవికుమార్‌(చపాతిరూలర్‌), గుగులోతు నరేష్‌(ఫుట్‌బాల్‌), ఇస్లావత్‌ ఠాగూర్‌ రవీందర్‌నాయక్‌(కెమెరా), భూక్య గోపికృష్ణ(సాసర్‌), అజ్మీరా రత్నాకు(కుట్టుమిషన్‌) గుర్తు కేటాయించారు.

Advertisement
 
Advertisement