Independence Day Song : తరం, తరం, నిరంతరం

India Independence day song : A tribute by Sreenatha Chary - Sakshi

దేశ స్వాతంత్య్రంలో సాహిత్యం పాత్ర మరువలేనిది. నిజానికి ఏ ఉద్యమం అయినా.. సాహిత్యంతో ప్రజలను జాగృతం చేస్తుంది. ఒక్కతాటిపైకి తెస్తుంది. అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాటలు, నినాదాలు, కవిత్వాలు, ప్రసంగాలు.. ఒకటేమిటి.. ఉద్యమ స్పూర్తిని పెల్లుబికెలా చేశారు మహానుభావులు.

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా యువతను మరింత బలోపేతం చేస్తూ, జాతి నిర్మాణ బాధ్యతను చక్కగా గుర్తు చేసే ప్రేరణ గీతాన్ని ప్రజల ముందుకు తెచ్చారు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. పాటకు సంగీతం,  కూర్పు, గానం అందించారు సినీ గాయకులు రవివర్మ పోతేదార్.


(సినీ గాయకులు రవివర్మ పోతేదార్)

|| పల్లవి ||
తరం, తరం, నిరంతరం, నిర్భయ నవతరం మీరు
అనంతరం, అనవరతం, అపూర్వ యువతరం మీరు
తరం, తరం, నిరంతరం, నిర్భయ నవతరం మీరు
అనంతరం, అనవరతం, అపూర్వ యువతరం మీరు
జాగరూకత జారిపోతే తరిగిపోయే తురగ మీరు
జాగరూకత జారిపోతే తరిగిపోయే తురగ మీరు
జగతి కొరకు..., జాతి  కొరకు..., జాగృతమవ్వాలి మీరు
వందేమాతరం...భారతీవందనం!
వందేమాతరం...భారతీవందనం!!

|| చరణం 1 ||
ఎగిసి పడే రక్తం మీరు
ఎవరెస్టునైనా ఓడించే అగ్ని శిఖలు మీరు
ఎగిసి పడే రక్తం మీరు
ఎవరెస్టునైనా ఓడించే అగ్ని శిఖలు మీరు
సునామీ కెరటం మీరు
అరుణ సింధూర విజయ సౌరభం మీరు
సునామీ కెరటం మీరు
అరుణ సింధూర విజయ సౌరభం మీరు
పాల సంద్రాన ఆదిశేషుని వేయిపడగల హోరు మీరు
వందేమాతరం...భారతీవందనం!
వందేమాతరం...భారతీవందనం!!

|| చరణం 2 ||
భయం తెలియని ధైర్యం మీరు
భరత భూమిని బాగుచేసే బాధ్యతే మీరు
భయం తెలియని ధైర్యం మీరు
భరత భూమిని బాగుచేసే బాధ్యతే మీరు
శంఖనాదం మీరు
చిత్త శుద్ధికి, లక్ష్యసిద్ధికి అర్థమే మీరు
శంఖనాదం మీరు
చిత్త శుద్ధికి, లక్ష్యసిద్ధికి అర్థమే మీరు
శిలయు మీరు, శిల్పి మీరు, చరితకెక్కే స్థపతి మీరు
వందేమాతరం...భారతీవందనం!
వందేమాతరం...భారతీవందనం!!
||తరం, తరం, నిరంతరం… || 

(రచన:డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి; 9848023090)

Read latest Literature News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top