కర్నూలు: చెక్‌బౌన్స్ కేసులను స్పెషల్ లోక్ అదాలత్‌లో రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇన్చార్జి జిల్లా న్యాయమూర్తి పి.వాసు సూచించారు. జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లీలా వెంకటశేషాద్రితో కలసి ఆయన మాట్లాడారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో శనివారం (21వ తేదీ) చెక్ బౌన్స్ కేసులపై స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తామన్నారు. కోర్టుల్లోని పెండింగ్ చెక్‌బౌన్స్ కేసులు, ప్రీలిటిగేషన్ కేసులను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. కక్షిదారుల సౌకర్యార్థం తమ కేసులను పరిష్కరించుకునేందుకు వీలుగా ఉమ్మడి జిల్లాలో 16 లోక్ అదాలత్ బెంచిలను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ ఉపయోగించుకుని తమ కేసులను రాజీపూర్వకంగా స్పెషల్ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు.


