జెడ్పీ చైర్మన్‌గా చూడి ఉలిగయ్య | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్మన్‌గా చూడి ఉలిగయ్య

Nov 21 2026 2:44 AM | Updated on Nov 21 2026 2:44 AM

● వైస్‌ చైర్‌పర్సన్‌గా డాక్టర్‌ సాధిక షేక్‌

● ప్రమాణ స్వీకారం చేయించిన

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా కౌతాళం జెడ్పీటీసీ సభ్యుడు చూడి ఉలిగయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌గా దేవనకొండ జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్‌ సాధిక షేక్‌ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరి చేత జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి ప్రమాణ స్వీకారం చేయించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో జెడ్పీ నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఈ సందర్భంగా జెడ్పీటీసీలుగా ఎన్నికై న వారందరి చేత జిల్లా కలెక్టర్‌ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, స్వతంత్ర జెడ్పీటీసీలతో పాటు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు గూళ్యం బసవరాజు(ఆస్పరి), ఉరుకుందప్ప(ఆదోని–1), చిట్టెమ్మ(ఎమ్మిగనూరు), జి.భీమారెడ్డి(మంత్రాలయం) హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతన ప్రజా ప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్యను అందించే పాఠశాలలు, మెరుగైన రహదారులు, పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ తదితర కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు కేఈ శ్యాంకుమార్‌, బొగ్గుల దస్తగిరి, డా.పార్థసారథి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, జెడ్పీ సీఈఓ ఆర్‌.సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణస్వీకారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement