కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా ఏబీ రాంప్రసాద్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పూర్తి అదనపు బాధ్యతతో సీఈవోగా పనిచేసిన బాలాజీరావు నుంచి చార్జీ తీసుకున్నారు. నూతన సీఇవోను జనరల్ మేనేజర్లు రామాంజనేయులు, శివలీల, డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌కుమార్, నాగిరెడ్డి, ఏజీఎంలు త్రినాథ్‌రెడ్డి, రాఘవేంద్ర తదితరులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈయన అనంతపురం డీసీసీబీలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈయన 2020 నుంచి 24 వరకు అనంతపురం డీసీసీబీ సీఇవోగా పనిచేశారు. ప్రస్తుతం డీజీఎంగా కొనసాగుతున్న ఆయనను కర్నూలు డీసీసీబీ సీఇవోగా రెండున్నర నెలల కిత్రం బోర్డు ఎంపిక చేసింది. ఇటీవలనే ఆర్‌బీఐ ఈయన ఎంపికను ఆమోదించింది. ఈ సందర్భంగా బ్యాంకు సీనియర్ అధికారులతో ఆయన మాట్లాడుతూ బ్యాంకు అభివృద్ధికి, రైతుల అభ్యున్నతికి కలసికట్టుగా మరింత జవాబుదారీతనంతో పని చేద్దామని పిలుపునిచ్చారు. కాగా డీసీసీబీ సీఇవోగా ఐదు నెలలకుపైగా పనిచేసిన బాలాజీరావును బ్యాంకు సీనియర్ అధికారులు తదితరులు సత్కరించి వీడ్కోలు పలికారు.


