● బ్రాహ్మణకొట్కూరులో బోణి కొట్టిన
ఎంపీటీసీ మాదిరెడ్డి శాంభవి
నందికొట్కూరు: టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత సొంత ఊరు బ్రాహ్మణకొట్కూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మాదిరెడ్డి శాంభవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. శనివారం నామినేషన్ల పరిశీలనలో బ్రాహ్మణకొట్కూరు–02లో వైఎస్సార్‌సీపీ తరఫున మాదిరెడ్డి శాంభవి వేసిన నామినేషన్ రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. టీడీపీ తరఫున ఎస్. సలేహబేగం నామినేషన్ పత్రంలో తప్పులు దొర్లడంతో పరిశీలించిన రిటర్నింగ్ అధికారి డి. వరప్రసాద్ ఎలక్షన్ నిబంధనల ప్రకారం తిరస్కరించారు. దీంతో వైఎస్సార్‌సీపీ తరఫున వేసిన నామినేషన్ మాదిరెడ్డి శాంభవి చెల్లుబాటు అయ్యిందని రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ ఏకగ్రీవం కావడంతో పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు.


