గొరవయ్యల నృత్యాలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడలతో దేవరగట్టు మురిసిపోయింది. గురు గొరవయ్యలు వచనాలు చెబుతూ పూనకంతో ఊగిపోయారు. IIలోu
● మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తనయుడు కేఈ రుద్రఫణి గౌడ్ పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా ఈనెల 21న నామినేషన్ వేశారు. తమ కుమారుడికే జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ తండ్రి కేఈ ప్రభాకర్, పెదనాన్న మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పచ్చ పార్టీ ముఖ్య నేతలపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఆ మేరకు పార్టీ కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నామినేషన్ చెల్లుబాటు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి జెడ్పీటీసీ అభ్యర్థికి జిల్లాలోని రూరల్ పరిధిలో ఓటు నమోదై ఉండాలి. కానీ రుద్రఫణి గౌడ్‌కు కర్నూలు అర్బన్‌లో ఓటు ఉండటం గమనార్హం. ఇదిలాఉంటే ఈయన వేసిన రెండు నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి.


