ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి

Oct 25 2026 12:11 AM | Updated on Oct 25 2026 12:11 AM

కర్నూలు(సెంట్రల్‌): ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణలో జిల్లా కలెక్టర్‌ పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు తమకు అప్పగించిన బాధ్యతలను నిష్పక్షపాతంగా, అప్రమత్తతతో నిర్వర్తించి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా సహకరించాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఎన్నికల నిర్వహణ సమాచారాన్ని పరిశీలించాలన్నారు. పోలింగ్‌ ముగిసే సమయానికి ముందే క్యూలో ఉన్న ఓటర్లందరికీ నిబంధనల ప్రకారం టోకెన్లు జారీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ పేపర్ల లెక్కలు, పేపర్‌ సీల్‌ ఖాతా, ప్రిసైడింగ్‌ అధికారి డైరీ తదితర రికార్డులను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించారా లేదా అన్నది మైక్రో అబ్జర్వర్లు ప్రత్యేకంగా పరిశీలించాలన్నారు. భవిష్యత్తులో ఏవైనా ఫిర్యాదులు, సందేహాలు లేదా న్యాయపరమైన అంశాలు తలెత్తినప్పుడు ఈ రికార్డులే ఆధారాలుగా ఉపయోగపడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో నోడల్‌ అధికారులు డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నరసింహా రెడ్డి, ిసీపీఓ భారతి, ఎల్‌డిఎం పి.మోహన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement