జీవనోపాధి దూరం..దూరం | - | Sakshi
Sakshi News home page

జీవనోపాధి దూరం..దూరం

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

పనుల్లేక పిల్లాపాపలతో కలసి వలస వెళ్తున్న వీరు కోసిగి మండలం దుద్ది గ్రామస్తులు. వీరే కాకుండా పలు గ్రామాల్లో 600 మంది ప్రజలు ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని చాపూరు, గబ్బూరు, మటమారి తదితర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. తమతో పాటు బడుల్లో చదువుకునే పిల్లలను సైతం తీసుకెళ్లారు. ప్రభుత్వం పనులు కల్పించడం లేదని, అరకొర చేసిన పని కూలి కూడా ఇవ్వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో వలస వెళ్తున్నట్లు చెప్పారు. – కోసిగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement