మసిబారిన బతుకులు! | - | Sakshi
Sakshi News home page

మసిబారిన బతుకులు!

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె పోరాటం రణరంగమవుతుంది మా గోడు పట్టించుకునే వారేరి

జిల్లాలో నియోజకవర్గాల

వారీగా వీఆర్‌ఏలు

‘పచ్చని’ హామీలు..

పాదయాత్రల సమయంలో ‘యువగళం’ వేదికగా లోకేష్‌బాబు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే పే స్కేల్‌ అమలు చేస్తాం, అర్హత ఉన్నవారికి ప్రమోషన్లు ఇస్తాం, అలవెన్స్‌లు ఇస్తాం అని నమ్మబలికారు. గద్దెనెక్కగానే అవన్నీ మరిచి పోయారు. డిమాండ్ల సాధనకు నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం కనీస స్పందన లేదు. ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ సమ్మె ఆపేది లేదు.

– నారాయణ, వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు

40 ఏళ్లుగా రాత్రింబవళ్లు పల్లెల్లో ప్రభుత్వ సేవల కోసం పనిచేస్తున్నాం. మేము చేయని పనిలేదు. ఏ అధికారి వచ్చిన వారికి నీళ్ల దగ్గర నుంచి భోజనం పెట్టేవరకు అన్ని సపర్య లు చేయాలి. అనాథ శవాలకు మేమే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాం. రోజుకు కనీస కూలీ కూడా పడటం లేదు. తక్షణమే హామీలు అమలు చేయకపోతే ఈ పోరాటం రణరంగమవుతుంది.

– పెద్ద మాబుషా, వీఆర్‌ఏ, పి.చింతకుంట

సుమారు 35 ఏళ్లుగా పనిచేస్తున్నా. ఈ మధ్య కూలి పనికి పోదామన్నా కుదరడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేపిస్తూనే ఉంటారు. చాలీచాలని జీతంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రూ 10,500తో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో నాయకులు, పై అధికారులు వచ్చి చూపించాలి. రెండు వారాలుగా అన్ని వదులుకుని నిరాహార దీక్ష చేస్తుంటే మా గోడు పట్టించుకునే నాథుడు లేరు.

– శాంతమ్మ, వీఆర్‌ఏ, చిన్న కందుకూరు

ఆళ్లగడ్డ: గ్రామానికి పోలీస్‌, రెవన్యూ, పంచాయతీ, వ్యవసాయ.. తదితర శాఖల ఏ అధికారి వచ్చిన ముందుగా కనిపించేది గ్రామ వీఆర్‌ఏనే. గ్రామ స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగానికి అసలైన వెన్నముక వీఆర్‌ఏ (తలారి). అర్ధరాత్రి ఇసుక రీచ్‌ల దగ్గర కాపలా అయినా, రీ – సర్వే, భూ తగదాలు, కొలతలు, ఆఖరికి ఏదైనా సంఘటన జరిగినప్పుడు శవాల దగ్గర, తుపాన్లు, వరదల సమయంలో ప్రాణాలకు తెగించి విధుల్లో ఉండేది వీరే. ఏళ్ల తరబడి వీరు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నా పట్టించుకునే వారు లేరు. నంద్యాల జిల్లాలో 1,346 మంది వీఆర్‌ఏలు పని చేస్తుండగా మరో 500 దాకా ఖాళీలు ఉన్నట్లుగా అంచనా. దశాబ్దాలుగా చాలీచాలనీ వేతనాలతో చాకిరీ చేస్తున్నా నేటికి తమ జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో లోకేశ్‌ వీఆర్‌ఏల భుజం తడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడిచి పోయింది. ఇచ్చిన ఐదు హామీల్లో కనీసం మూడైనా అమలు చేయాలని తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెబాట పట్టడంతో గ్రామాల్లో పాలన స్తంభించి పోయింది. విధులను బహిష్కరించి తహసీల్దార్‌ కార్యాలయాల ఎదురుగా నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ ప్రభుత్వం ఇస్తామన్న కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వక పోవడంతో అర్ధాకలితో కుటుంబాలను నెట్టకొస్తున్నారు. వీఆర్‌ఏల కారుణ్య నియామకాల విషయంలో టీడీపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. సర్వీసులో ఉండగా రాత్రింబవళ్లు వెట్టిచాకిరీ చేస్తూ విధి నిర్వహణలోనే కన్ను మూసిన వీఆర్‌ఏల కుటుంబాలు నేడు దిక్కులేని స్థితిలో వీధిన పడుతున్నా పట్టించుకోవడం లేదు.

స్తంభించిన సేవలు.. ఇబ్బందుల్లో ప్రజలు

వీఆర్‌ఏల నిరవధిక సమ్మె కారణంగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా పడకేసింది. క్షేత్రస్థాయిలో విచారణలు, ధ్రువీకరణ పత్రాల జారీ, భూ రీసర్వే, భూ రికార్డుల పరిశీలన, ఈ క్రాప్‌, పంటల బీమా, ప్రభుత్వ బకాయిల వసూలు, భూముల కొలతలు, నీటి పారుదల నిర్వహణ తదితర నిత్యావసర పను లు పూర్తిగా స్తంభించి పోయాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మొండివైఖరి వీడటం లేదు.

పదోన్నతులపై దాగుడు మూతలు..

వీఆర్‌ఏల పదోన్నతుల విషయంలో టీడీపీ ప్రభుత్వం తీవ్రమైన దాగుడు మూతల రాజకీయం చేస్తోంది. యువగళం పాద యాత్రలో అర్హతలున్న ప్రతి వీఆర్‌ఏకు రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ప్రమోషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వీఆర్‌ఓ గ్రేడ్‌ – 2 నియామకాల్లో సర్వీస్‌ రూల్స్‌ సవరణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేయడానికి ఐదేళ్ల గడువు అంటూ జీవోలు తెచ్చారే తప్ప క్షేత్ర స్థాయిలో ఏళ్ల తరబడి డిగ్రీలు, పీజీలు చేసిన సీనియర్‌ వీఆర్‌ఏలు ఎందరో ఉన్నా ప్రమోషన్లు ఇవ్వడంలో మాత్రం తీవ్ర ఉదాసీనత ప్రదర్శించడం గమనార్హం

నియోజకవర్గం వీఆర్‌ఏలు

ఆళ్లగడ్డ 296

శ్రీశైలం 171

బనగానపల్లె 292

డోన్‌ 142

నంద్యాల 120

నందికొట్కూరు 296

పాణ్యం 99

మొత్తం 1,346

వీఆర్‌ఏల ప్రధాన డిమాండ్లు..

తెలంగాణలో మాదిరిగాపే స్కేల్‌

అమలు చేయాలి

నామినీ వీఆర్‌ఏలను బేషరతుగా

రెగ్యులర్‌ వీఆర్‌ఏలుగా గుర్తించాలి

వన్‌టైం సెటిల్‌మెంట్‌గా గ్రేడ్‌ టూ

వీఆర్‌ఏలుగా పదోన్నతులు కల్పించాలి

20 శాతంగా ఉన్న అంటెండర్‌,

నైట్‌ వాచ్‌మెన్‌, డ్రైవర్‌ పోస్టుల ప్రమోషన్ల కోటాను 70 శాతానికి పెంచాలి

కూటమి ప్రభుత్వానికి పట్టని

వీఆర్‌ఏల ఆకలి కేకలు!

హామీలు అమలు చేయాలని

10 రోజులుగా సమ్మె

స్తంభించిన గ్రామ పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement